Andhra PradeshEast GodavariNews

*ప్రధాని మోదీ సుపరిపాలన* *ప్రపంచానికే* *ఆదర్శప్రాయం*

*ప్రధాని మోదీ సుపరిపాలన* *ప్రపంచానికే* *ఆదర్శప్రాయం* :
 *ధన్యవాదములు* *తెలుపుతూ* *పోస్ట్ కార్డులు*
– *మాజీ మంత్రి వర్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు*
 : ప్రస్తుత భారత ప్రధానిగా, గత గుజరాత్ ముఖ్యమంత్రి గా శ్రీ నరేంద్ర మోదీ గారు అందించిన సుపరిపాలన ప్రపంచానికే ఆదర్శప్రాయమని కామినేని  గారు అన్నారు. నరేంద్రమోది జన్మదిన వారోత్సవాల సందర్భంగా దేశ వ్యాప్తంగా గత 20 రోజులుగా నిర్వహిస్తున్న సేవా సమర్పణ అభియాన్ కార్యక్రమ ముగింపు వేడుకలను నియోజకవరగస్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో  గురువారం వరహపట్నం లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ విశ్వ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారినుంచి భారత్ ను సురక్షితంగా కాపాడటంలో ప్రధాని మోదీ గారు తీసుకున్న చర్యలు స్ఫూర్తిదాయకం మన్నారు.ముఖ్యంగా 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి దేశ వ్యాప్తంగా ఉచితంగా కరోనా నియంత్రణ వాక్సిన్ వేయించాలని నిర్ణయించి ఇప్పటివరకు 90కోట్లమందికి అందించిన ఘనత మోదీగారికే  దక్కుతుందని కొనియాడారు.అదే విధంగా కరోనా కష్ట కాలంలో నిరుపేదలకు ఉచితరేషన్ అందించి ఆదుకున్న మహానేత
గా అభివర్ణించారు.
 *మోదీ మీకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ కార్డులు* ప్రధానిగా, ముఖ్యమంత్రి గా 20 సంవత్సరాలు పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశానికీ చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా మోదీ గారు మీకు ధన్యవాదములు అని తెలియచేస్తూ పోస్ట్ కార్డులను ప్రధానికి పంపించే కార్యక్రమాన్ని  శ్రీ కామినేని శ్రీనివాస్ గారు స్థానిక బిజెపి నాయకులతో కలిసి ప్రారంభించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణారావు నియోజకవర్గ కన్వీనర్ పైడిపాటి శివ శంకర్ కైకలూరు మండల అధ్యక్షుడు కట్ట వీర రాఘవులు ప్రధాన కార్యదర్శి నీలం మల్లేశ్వరరావు, మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యవోలు నాగలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు గరికిపాటి రాంబాబు, నియోజకవర్గ కన్వీనర్ పామర్తి రాంబాబు మైనారిటీ మోర్చా మండల అధ్యక్షుడు షేక్ భాష క కలిదిండి మండల మాజీ అధ్యక్షులు ఒక శ్రీనివాస్,సీనియర్ నాయకులు బండి శ్రీనివాస్, బిసి రాష్ట్ర కార్యదర్శి వీర శివాజీ ,మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ ఎస్ సి జిల్లా ఉపాధ్యక్షుడు మొవ్వ ఫణి మండల ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవి కుమార్ ,బాలకృష్ణ,రాజేష్, పాల్గొన్నారు

Comment here