Andhra PradeshEast GodavariNews

 ప్రమాదకరంగా లాకు ప్లాట్ ఫాం – పట్టించుకోని అధికారులు”.

 ప్రమాదకరంగా లాకు ప్లాట్ ఫాం – పట్టించుకోని అధికారులు”.
కోస్తా ఎన్ కౌంటర్ . కడియం … మండలంలోని కడియం ప్రధాన కాలువ లాకుల వద్ద గల నావిగేషన్ ఛానల్ ప్లాట్ ఫాం పాడై పగుళ్లు ఏర్పడి , రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరుకుంటుంది. ఈ ప్లాట్ ఫాం ద్వారా మాధవరాయుడుపాలెం , కడియపుసావరం తదితర గ్రామాల రైతులు , కడియం పేపర్ మిల్లు ఉద్యోగులు , కార్మికులు , ప్రయాణీకులు , విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. గత 2 సంవత్సరాలుగా మరమత్తులు చేపట్టకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సైకిళ్ళు , ద్విచక్ర వాహనాల ద్వారా రాకపోకలు కొనసాగించకుండా లాకు సిబ్బంది ముల్లకంచె వేసారు. లాకు సిబ్బందికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాల పంటకు సాగునీరు , లక్షలాదిమంది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్న కడియం లాకుల మరమత్తులు చేపట్టకపోవడం చాలా దారుణం అని రైతులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. (దీనిపై ఇరిగేషన్ డి.ఇ.ఇ. ని వివరణ కోరగా).
రవి కుమార్
డి.ఇ.ఇ. ఇరిగేషన్ ,
కాకినాడ.
నావిగేషన్ ఛానల్ ప్లాట్ ఫాం మరమత్తులు , అలాగే లాకు షట్టర్ బేరింగ్స్ మార్పులకు సంబంధించి పనులు చేపట్టుటకు అంచనాలు తయారు చేసి శాఖ ఉన్నతాధికారుల అనుమతికోసం పంపించడం జరిగింది. అనుమతులు వచ్చిన వెంటనే టెండర్స్ పిలిచి పనులు చేపట్టి పూర్తిచేస్తాం. కాలువలు నీరు ప్రవహిస్తున్నా పనులకు ఏ విధమైన ఇబ్బందీ ఉండదని వీలైనంత త్వరలోనే పనులు చేపట్టే అవకాశం ఉందన్నారు.

Comment here