Andhra PradeshEast GodavariNews

*ప్రశ్నిస్తే కేసులు అండగా నిలబడితే అరెస్టులు*

*ప్రశ్నిస్తే కేసులు అండగా నిలబడితే అరెస్టులు*
*రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు*
*రాక్షసులు చేతిలో బలైన కుటుంబాలను పరామర్శిస్తే నేరమా ?*
రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు
*బండారు సత్యానందరావు*
కోస్తా ఎన్ కౌంటర్, కొత్తపేట
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అత్యాచారాలు , హత్యలు ఎక్కువైపోయి ఎందరో మహిళలు భలే పోయారని బండారు విమర్శించారు.
దుర్మార్గుల చేతిలో బలైపోయిన మహిళల కుటుంబాలను పరామర్శించి ఆదుకోవడం వారికి మనోధైర్యం ఇవ్వటం కూడా నేరమా
అని ప్రశ్నించారు.
ఇటీవల రాక్షసుల చేతిలో బలైపోయిన అనూష కుటుంబాన్ని ఓదార్చేందుకు  వెళ్ళిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
నారా లోకేష్
ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్
*బండారు సత్యానందరావు
ఈ మేరకు స్థానిక బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి కాగడాలతో నిరసన తెలియజేయాలని అనుకున్నప్పటికీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్న  బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ నాయకులను
పోలీసులు అక్రమంగా అడ్డుకోవడంతో వాడపాలెం లోని బండారు స్వగృహం వద్ద కార్యక్రమం చేసి నిరసన తెలియజేసారు.
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా
*లేక బ్రిటిష్ కాలం నాటి పరిపాలన ఉన్నామా
అని ప్రశ్నించారు.
బ్రిటిష్ కాలంలో కూడా ఈ విధంగా చేయలేదని బండారు అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ విధంగా అక్రమ అరెస్టు చేస్తే మీరు అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర లో చేయగలిగేవారా అని బండారు ప్రశ్నించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఇటువంటి ప్రణాళిక చర్యలవల్ల ఇప్పటికే ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని ఇకనైనా ఇటువంటి  అనాగరిక చర్యను మాని పరిపాలనపై దృష్టి సాగించాలని బండారు హితవు పలికారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area

Comment here