Andhra PradeshEast GodavariNews

ప్రియాంకా గాంధీ గృహనిర్భందం దారుణం

 

ప్రియాంకా గాంధీ గృహనిర్భందం దారుణం
` మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి
` నగరంలో కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శన
రాజమహేంద్రవరం :
ఉత్తరప్రదేవ్‌ రాష్ట్రంలోని అఖింపూర్‌ కేరి జిల్లాలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కుమారుడు కారు ఎక్కించిన ఘటన అమానవీయమని కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండిరచారు. రైతులకు మద్ధతుగా ఘటనలో మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీని గృహ నిర్భందం చేయడం దారుణమని నిరసన వ్యక్తం చేసారు. పిసిసి అధ్యక్షుడు డాక్టర్‌ సాకే శైలజానాధ్‌ పిలుపు మేరకు నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌, సిటీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ బోడ వెంకట్‌ ఆధ్వర్యంలో స్థానిక దానవాయిపేట గాంధీ పార్క్‌ నుంచి జాంపేట గాంధీ విగ్రహం వరకు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రవేశపెట్టిన వ్యవసాయ అనుబంధ రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతున్న విషయం విదితమేనని, ఈ నేపథ్యంలో బిజెపి అధికారంలో వున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అఖింపూర్‌ కేరి జిల్లాలో ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర మంత్రి కుమారుడు కారుతో తొక్కించడంతో ఇద్దరు రైతులు మరణించడంతో పాటుగా మరో ఎనిమిది మంది రైతులు గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ ఘటనలో మృతిచెందిన మరియు గాయపడిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్న నాయకురాలు ప్రియాంకా గాంధీని పోలీసులు గృహనిర్బంధం చేయడం బిజెపి ప్రభుత్వ సిగ్గుమాలిన చర్యని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు తక్షణం క్షమాపణ చెప్పడంతో పాటు ఘటనకు బాధ్యుడైన కేంద్ర మంత్రి కుమారుడిని అరెస్టు చేసి సదరు మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసారు. బీజేపీ తీసుకుని వచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తున్నారు. ఘటనలో మృతిచెందిన రైతుల కుటుంబాలకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమం నిర్వహిస్తుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బాలాజీ శర్మ, బత్తిన చంద్రరావు, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు గట్టి నవతారకేష్‌, నరాల నందు, ప్రేమ్‌ భాస్కర్‌, ఎం.శ్రీకర్‌, కె.కళ్యాణ్‌కుమార్‌, సంపత్‌, తరుణ్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.
“`

Comment here