Andhra PradeshEast GodavariNews

ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి

ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి
కోస్తాఎన్ కౌంటర్, గండేపల్లి : మండల ఫోటోగ్రాఫర్ల నిరసన.
ఫోటోగ్రాఫర్ భాషపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద శాంతి నిరసన వ్యక్తం చేశారు.అనంతపురంలో ఎస్.ఆర్.గ్రాండ్ ఫంక్షన్ హల్ సిబ్బంది  ఫోటోగ్రాఫర్ ల పై అమానుష  దాడిని ఖండిస్తూ నిందితుల పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గండేపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ప్లే కార్డులతో  నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం మండల తసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ సరితకు  వినతి పత్రం అందజేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ సెక్రటరీ కోటి, మండల అధ్యక్షుడు సూరిబాబు మాట్లాడుతూ అనంతపురంలో ఫోటోగ్రాఫర్ భాష పై ఎస్ ఆర్ గ్రౌండ్ ఫంక్షన్ హాల్ సిబ్బంది అతి దారుణంగా కర్రలతో కొట్టి దాడి చేశారని దీనిపై తక్షణమే ఎంక్వైరీ వేసి సంబంధిత ముద్దాయిలను తక్షణమే అరెస్టు చేయాలని  లేనిచో జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని భాష కు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.ఈ కార్యక్రమంలో    మండల ఫోటోగ్రాఫర్స్ అందరూ పాల్గొన్నారు.

Comment here