Andhra PradeshEast GodavariNews

బాల కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

కోస్తా ఎన్ కౌంటర్, అమలాపురం; ఏపీలో బాల కార్మికులుగా బిసి కులానికి చెందినవారు 15160 మంది. ఓసి కులానికి 3090 మంది .ఎస్ .సి కులానికి 5342 మంది. ఎస్టీ కులానికి 4293 మంది. ముస్లిం కులానికి6152 మంది. ఉన్నట్టు ఆపరేషన్ ముస్ఖాన్ కార్యక్రమం  ద్వారా సర్వే లెక్కలు చెబుతున్నాయి.  అయితే బాల కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని , వారికి విద్యను అందించాలని అమలాపురం మండలం పేరూరు కు చెందిన  ప్రముఖ న్యాయవాది కుడుపూడి అశోక్ నేషనల్ హ్యూమన్ రైట్స్ లో ఈ ఏడాది జూన్ 21న పిటిషన్ దాఖలు చేశారు. ఆపిటిషన్ విచారించిన జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్  (న్యూఢిల్లీ) ఎనిమిది  వారాలు లోపు చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర ప్రభుత్వానికి  ఆదేశాలు జారీ చేసినట్టు  మీడియాకు ఒక ప్రకటన ద్వార అశోక్ తెలిపారు

Comment here