Andhra PradeshEast GodavariNews

బిజెపి ఎస్సీ మోర్చా కమిటీ బాధ్యతల స్వీకారం 

బిజెపి ఎస్సీ మోర్చా కమిటీ బాధ్యతల స్వీకారం
      రాజమండ్రి రూరల్ మండలం భారతీయ జనతాపార్టీ  యస్.సి.మోర్చా కమిటీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం మండల బిజెపి  అధ్యక్షులు యానాపు  ఏసు ఆధ్వర్యంలో   గోదావరి ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించారు.  అధ్యక్షునిగా రాజవోలు గ్రామానికి చెందిన గంపల బాబులు,  ప్రధాన కార్యదర్శిగా బోడాసింగ్ రాజేష్, ఉపాధ్యక్షులుగా విజ్జన శేఖర్ బాబు, కండెల్లి రామారావు, పౌరోజు ఏసు, కార్యదర్శిగా చాపల నరేష్, బేతల యాకోబు, పసలపూడి సువర్ణ రాజు, అనంతవరపు శ్రీను, తదితరుల బాధ్యతలను స్వీకరించారు.
కరోనా జాగ్రత్తలపై శిక్షణ ….
    అనంతరం కరోనా మూడో దశ  వ్యాప్తిని నిరోధించడానికి అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవడం గురించి  రాజమండ్రి పార్లమెంట్ జిల్లా రూరల్ అసెంబ్లీ పరిధిలో  శిక్షణా కార్యక్రమం గోదావరి ఫంక్షన్ హాల్ లోనే నిర్వహించారు.  డాక్టర్ పిల్లాడి పరమ హంస , యోగ గురువు తలాటం ప్రకాశరావు ముఖ్యఅతిథిలుగాపాల్గొని కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా హెల్త్ వాలంటరీ తనుబుధ్ధి సూర్య భాస్కర్ మాట్లాడుతూ రాబోయే కరోనా తీవ్రతను గుర్తించి రాష్ట్రపార్టీ పిలుపు మేరకు ప్రతీ మండలం నుండి 4గురు హెల్త్ వొలేంటీర్లకు, వారిద్వారా ప్రతీ గ్రామంనుండి హెల్త్ వొలేంటీర్లుకు శిక్షణ ఇచ్చి ప్రజలకు ఎల్లప్పుడూ  పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉండే విదంగా ప్రణాళిక  రచిస్తున్నామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా హెల్త్ వొలేంటీర్లు ఆడబాల గణపతిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగుర్రాల వెంకట్, జిల్లా యస్ సి మోర్చా అధ్యక్షులు జినిపే గంగరాజు,  రూరల్ ఇన్చార్జి కాలేపు సాయి, కోనా  సతీష్, మండల ఉపాధ్యక్షులు అల్లంగి అనిల్, మండల ప్రధాన కార్యదర్శి యన్.వి.బి.యన్.ఆచారి  తదితరులు పాల్గొన్నారు

Comment here