Andhra PradeshEast GodavariNews

బిజెపి యువమోర్చా  మెగా రక్తదాన శిబిరం

బిజెపి యువమోర్చా  మెగా రక్తదాన శిబిరం
     భారత ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవం, ప్రభుత్వ నేతగా మోదీజీ 20ఏళ్ళు ముగించుకున్న సందర్భంగా 20 రోజులపాటు భారతీయ జనతా పార్టీ చేపడుతున్న సేవా మరియు సపర్పణ అభియాన్ లో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో, సంజీవని బ్లడ్ బ్యాంక్  సౌజన్యంలో రూరల్ యువమోర్చా అధ్యక్షులు మల్లాడి వరప్రసాద్ అధ్యక్షతన బొమ్మూరులో నరసింహారాజు ఫంక్షన్ హాల్ లో  మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ, సేవా సమర్పణ జిల్లా ఇంచార్జ్ యనుమల రంగబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోడూరి లక్ష్మీనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగల గోపిశ్రీనివాస్, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కందుకూరి మనోజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పన్నాల వెంకటలక్ష్మి లు,మండల అధ్యక్షులు యానాపు ఏసు , పీవీ సుబ్రహ్మణ్యం లు విచ్చేసారు.
   ముందుగా స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి అమృత్క్ష మహోత్సవ్ ద్వారా భారత స్వాతంత్ర్య అమర వీరుల జీవిత చరిత్రలు యువత తెలుసుకోవాలని వారి ఆశయాలను ఆలోచనలు అప్పటి పరిస్థితులను అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ నేతగా విశ్వగురువుగా నరేంద్రమోదీ ఉన్నారని, ప్రపంచం ఇపుడు భారత్ వైపు చూస్తోంది అని, సమృద్ధి, స్వచ్ఛ,విశిష్ట,అఖండ భారత్ దిశగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న నరేంద్రమోదీ జన్మదినోత్సవం, ప్రజానేతగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏడు అక్టోబర్ నాటికి 20ఏళ్ళు  గడుస్తున్న సమయంలో ఈ ఇరవై రోజులు సేవా కార్యక్రమాలు పార్టీ నిర్వహిస్తోందని  తెలిపారు.  విజయోత్సవాలు సంబరాలు కాకుండా సేవా కార్యక్రమా లను పెద్దఎత్తున నిర్వహిస్తూ ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు బీజేపీ కార్యకర్తలు అండగా వుంటున్నారని ఈ సంస్కృతి కేవలం భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని  తెలియజేసారు. లలిత్ జైన్,  అడబాల రామకృష్ణ , పిక్కి నాగేంద్ర,గుర్రాల వెంకటరావు,  సుంకర బాలు, పోనంగి పవన్, కాలెపు సాయి, సూర్యభాస్కర్, గాయత్రి, పిల్లాడి రుద్రయ్య, తంగేళ్ల శ్రీనివాస్, ఆరాధ్యుల సాయి , నవీన్, కండవల్లి సాయి, దుర్గవర్జుల సాయి, దుర్గా వర్ధిని , మార్కాని సతీష్ ప్రేమ్ , గోపీసెట్టి శివకృష్ణ, శాటిలైట్ సిటీ కోటేశ్వరరావు, బర్మా, కండెల్లి సురేష్, మల్లాది శశికాంత్, కుడిపూడి రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Comment here