Andhra PradeshEast GodavariNews

*బీసీలు ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం*

*బీసీలు ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం* బీసీలు ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు పెద్ది శెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో మాజీ ఎంపిటిసి, బీసీ నాయకుడు కోట వెంకట రావు ఆధ్వర్యంలో జరిగిన బీసీ, శెట్టి బలిజ సామాజిక వర్గాలకు చెందిన సమావేశం లో వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 58 లక్షల మంది బీసీలు ఉంటే, వారిలో 10 లక్షల మంది శెట్టిబలిజ, గౌడ కులస్తులు ఉన్నారన్నారు. సామాజిక పరంగా బీసీలు అధికంగా ఉన్నప్పటికీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అణచివేతకు గురవుతూనే ఉన్నారన్నారు. మండపేట నియోజకవర్గం లో అగ్ర కులస్తులు సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు వారికే టిక్కెట్లు కేటాయిస్తూ, బీసీలను అణిచి వేస్తున్నారన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు, ఎస్సీ ,ఎస్టీ ,మైనారిటీ కులాల సహకారం తీసుకుని బిసీ అభ్యర్థిని పోటీలో నిలిపి గెలిపించుకుని తమ సత్తా చాటుతా మన్నారు. బిసీ నేత కోట వెంకటరావు మాట్లాడుతూ సోమేశ్వరం గ్రామంలో ప్రస్తుత సర్పంచ్ తమ సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని, ఇకపై అటువంటి చర్యలకు పాల్పడితే తమ సత్తా ఏంటో చూపిస్తా మన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో బిసీల ఐక్యత, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మండపేట కు చెందిన బీసీ హక్కుల సాధన సమితి అధ్యక్షుడు చప్పిడి నాగు, కోట వీర వెంకట నరసింహారావు, చిట్టూరి త్రినాథ్, పిల్లి అప్పారావు దంగేటి తాతారావు తదితర సంఘ పెద్దలు పాల్గొన్నారు.

Comment here