Andhra PradeshEast GodavariNews

బైక్ దొంగలు అరెస్ట్ ’25 బైకులు స్వాధీనం’

కోస్త ఎన్ కౌంటర్, అనపర్తి;

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు పోలీస్ స్టేషన్ నందు డి.ఎస్.పి రామచంద్రారెడ్డి , సి.ఐ.  ఎన్.వి.భాస్కరరావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ మేరకు డిఎస్పి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బిక్కవోలు si  పి .వాసు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వాసు, తన సిబ్బందితో కలిసి బిక్కవోలు మెయిన్ రోడ్డు పై  కెనాల్ రోడ్డు వద్ద ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సుమారు రెండున్నర గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పారిపోతుండగా వారిని పట్టుకొని ఊరు పేరు అడగగా కొంగోడు గ్రామానికి చెందిన ఈరబోయిన శ్రీను, అలాగే తాపేశ్వరం  గ్రామానికి చెందిన అమల దాసు నాగరాజును విచారించారు. ఈ విచారణలో  వారు  నడుపుతున్న బైక్ apo5ba  44 58 హీరో స్ప్లెండర్ బైక్ గుర్తించి  సదరు బైకు  పోలీస్ స్టేషన్లో  213/2021 కేసులో చోరీ సొత్తు గా గుర్తించి స్వాధీనపరచుకోవడమైనది.దీంతోపాటు వారివద్ద  వున్న, వారు దొంగలించిన మొత్తం 25 బైక్ లను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం అయింది. ఈ మోటార్స్ బైకులు విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన  తెలిపారు. ఈ కేసు పట్టుకోవడం కోసం   కృషి చేసిన   బిక్కవోలు ఎస్ఐ పి. వాసు,  వీరబాబు, కే. శ్రీనివాసులు ,మంచి ప్రతిభ కనబర్చారు. అలాగే  ఎక్సైజ్ ప్రొబేషన్ యాక్ట్ కేసులో మూడు వేల లీటర్ల బెల్లం ఊట, 60 లీటర్ల  సారామరియు సామగ్రి స్వాధీనపరుచుకున్న మైనది. ఈ కేసులో గొల్లి లోవరాజు మరియు ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేయడం అయినది. ఈ సందర్భంగా  సి.ఐ. ఎన్. వి .భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తమ బైక్ కొనుగోలు చేసిన వెంటనే వారి పేరున ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Comment here