Andhra PradeshEast GodavariNews

బ్లడ్ డొనేషన్ దాత కసిరెడ్డి శాంతి కుమారి పుట్టినరోజు వేడుకలు…

బ్లడ్ డొనేషన్ దాత కసిరెడ్డి శాంతి కుమారి పుట్టినరోజు వేడుకలు…

గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సేవలు

ఆపదలో ఆదుకోవడం,రక్త దానం చేయడం లో కసిరెడ్డి శాంతి కుమారి సేవలు అభినందనీయం-కావూరి వరలక్ష్మీ

రాజమహేంద్రవరం సిటీ,అక్టోబర్15:
రాజమహేంద్రవరం స్థానిక వాస్తవ్యులు కసిరెడ్డి శాంతి కుమారి పుట్టినరోజు సందర్భంగా గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూతు ఓల్డ్ ఏజ్ హోం లో నివాసముంటున్న నిరుపేద వికలాంగ వృద్ధులకు పండ్లు ఫలములు స్నాక్స్ వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కావూరి వరలక్ష్మి మాట్లాడుతూ యౌవన వయస్సులో రెండు తెలుగు జంట రాష్ట్రములలో ఎక్కడ ఎవరికి బ్లడ్, ప్లేట్ లెట్స్ అడిగిన వెంటనే స్పందించి, అందించి దాదాపు కొన్ని వందల ప్రాణాలు శాంతి కుమారి కాపాడింది. ఈమె నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మరనేకులకు ఉపయోగకరమై యుండాలని కోరుకుంటూ ఆమెకు హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ సభ్యులు కావూరి సురేష్ కుమార్, కావూరి యామిని, సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట కమిటీ మరియు రిపోర్టర్ కూడెల్లి రత్నకిషోర్, కట్టుమూరి విజయ్ కుమార్, సునీల్, సమీర, సుధా మరియు నెహ్రూ యువ కేంద్ర యూత్ క్లబ్ వారు తదితరులు పాల్గొన్నారు.

Comment here