Andhra PradeshEast GodavariNews

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అంగర పల్లపు వీధిలో నెలకొల్పిన దుర్గాదేవికి కమిటీ ఆధ్వర్యంలో మహిళా భక్తులు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.పురోహితులు వారణాసి వెంకటేశ్వర రావు,సంతోష్ కుమార్ లు సిద్దిరెడ్డి శ్రీనివాస్ దంపతులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. మంగళవారం రాత్రి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు బాల బాలాజీ ఆచార్యుల పర్యవేక్షణలో ఉత్సవమూర్తుల విగ్రహాలతో స్వామివారి కల్యాణం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శరన్నవ రాత్రులు పురస్కరించుకుని ఉదయం,సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో దుర్గాష్టమి పూజలు నిర్వహించారు.

Comment here