Andhra PradeshEast GodavariNews

*భవానీలు ఆధ్వర్యంలో శరన్నవ రాత్రులు ఘనంగా ప్రారంభం*. 

*భవానీలు ఆధ్వర్యంలో శరన్నవ రాత్రులు ఘనంగా ప్రారంభం*.                    

కోస్తా ఎన్ కౌంటర్ రావులపాలెం భవాని ఆధ్వర్యంలో వెదిరేశ్వరం లో మందిరo(వడి ) పూజా కార్యక్రమం జరిగింది. తొలిరోజు విజయ దుర్గ అమ్మవారి అవతారం లో అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అభిషేకాలు, పుష్పార్చన లు, సహస్రనామార్చన, హోమం తదితర పూజా కార్యక్రమాలు భవాని భక్తులు ఘనంగా నిర్వహించారు. భవాని ఆకుల లోవరాజు మాట్లాడుతూ, అమ్మంటి పోషించేది,  రక్షించేది,  శిక్షించే మహిషాసురమర్ధిని గా చెడును  తొలగించి సత్ప్రవర్తనతో నడుచుకునే అలా చేస్తుందని,   సమయాను సారం అన్నపూర్ణయై ఆకలి తీరుస్తుందని,  సరస్వతి గా సు జ్ఞానం కలిగిస్తుందని, రైతుగా,  వైద్యురాలు గా,  రక్షకురాలు గా, కార్మికురాలు గా, మిలటరీ సైనికురాలు గా నిరంతరం మన జీవితాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న అమ్మ వారి రుణం తీర్చుకోలేనిదని, దసరా శరన్నవరాత్రులు అమ్మవారు విలువను తెలియజేసేదని ఆకుల లోవరాజు అన్నారు. దేవీ నామస్మరణలతో వెదిరేశ్వరం  గ్రామం  మారుమోగిపోయింది.

Comment here