Andhra PradeshEast GodavariNews

భార్యాభర్తల మృతి కలకలం

భార్యాభర్తల మృతి కలకలం
కోస్తా ఎన్ కౌంటర్, కడియం;
కడియం పోలీసు స్టేషన్ పరిధిలోని మధవరాయుడు పాలెం గ్రామంలో భార్యా ,భర్తల మృతి కలకలం రేపింది. మృతుడు కర్రి రాజారావు 60 ఇంట్లోనే ఉరివేసుకుని బల్వర్మ్రణం చెందగా భార్య పద్మ 55 రక్తపు మడుగులో విగతాజీవిగా పడివుంది.స్థానికుల సమాచారం మేరకు సీన్ లోకి వెళ్లిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయం తో ఆధారాలు సేకరిస్తున్నారు. మృదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మృతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.ఉద్యోగ రీత్యా కుమార్తె బెంగుళూరులోను,కుమారుడు ఢిల్లీ లోను స్థిరపడ్డారు. గురువారం రాత్రి వారు తల్లిదండ్రులకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో, ప్రక్కింటి సాయం కోరారు.తలుపులు బిగించి ఉండడంతో కిటికీ తెరిచి చూడగా భార్యా, భర్తలు విగతాజీవులుగా పడి ఉన్నారు.సంఘటనా స్థలంలో సీన్ ను బట్టి భార్య పద్మ తలపై రోకలి బండతో మోదీ హతమార్చి రాజారావు ఉరివేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామని రాజమహేంద్రవరం సౌత్ జోన్ డీస్పీ శ్రీలత తెలిపారు.

Comment here