Andhra PradeshEast GodavariNews

*మండలంలో నేషనల్ మోనిటరింగ్ కమిటీ పర్యటన*

*మండలంలో నేషనల్ మోనిటరింగ్ కమిటీ పర్యటన*

,*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* నేషనల్ లెవెల్ మోనిటరింగ్ కమిటీ మండలంలోని కూర్మాపురం,నదురుబాద గ్రామాల్లో బుధవారం పర్యటించింది. జిల్లాలో 20 గ్రామాలు ఎంపిక కాగా వాటిలో రెండు గ్రామాలు రాయవరం మండలం నుండి ఎంపికయ్యాయి. కేంద్ర బృందం సభ్యులు అలెగ్జాండర్ ,జాకోబ్ ఆధ్వర్యంలోని బృందం కూర్మాపురం,నదురుబాద గ్రామాల్లో పర్యటించి, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులను బృందం పరిశీలించింది.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ,సామాజిక పింఛన్లు ,ఉపాధి హామీ పనులు ,కూలీలకు జమ చేసిన నగదు వివరాలను, డ్వాక్రా సంఘాల పొదుపు సద్వినియోగం, పంచాయతీ రికార్డులు తదితర అంశాలను పరిశీలించి, పలు అంశాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడి అడపా వెంకటలక్ష్మి, అడిషనల్ పిడి మూక లింగం, ఎంపీడీవో మల్లపురెడ్డి శ్రీను, మండల ఇంజనీర్ రామనారాయణ, ఏపీవో సత్యనారాయణ, కూర్మాపురం సర్పంచ్ చౌటపల్లి చక్ర వేణి, నదురుబాద సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు డి. శ్రీనివాసరావు, కె. రామకృష్ణ ,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comment here