Andhra PradeshEast GodavariNews

*మండల సర్పంచ్ ల సమాఖ్య రద్దు*

*మండల సర్పంచ్ ల సమాఖ్య రద్దు*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* ప్రస్తుతం కొనసాగుతున్న మండల సర్పంచ్ ల సమాఖ్యను రద్దు చేస్తున్నట్లు పలువురు సర్పంచులు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
వారు మాట్లాడుతూ ప్రస్తుత సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్న నదురుబాద గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు పనితీరు బాగోలేదని, అందుకే సమాఖ్యను రద్దు చేస్తునట్లువారు తెలిపారు. త్వరలో కొత్త సమాఖ్యను ఎన్నుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వరం సర్పంచ్ ఆరిఫ్ ,వెదురుపాక సర్పంచ్ మల్లిడి సూరారెడ్డి, చెల్లూరు సర్పంచ్ పాలికి రాఘవా గోవింద్, వి.సావరం సర్పంచ్ కాకి కృష్ణవేణి కోటేశ్వరరావు, మాచవరం సర్పంచ్ కత్తుల సీతామహాలక్ష్మి అప్పారావు, వెంటూరు సర్పంచ్ వాసంశెట్టి వెంకట్రావు, తదితర సర్పంచ్లు పాల్గొన్నారు.

Comment here