Andhra PradeshEast GodavariNews

మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:స్థానిక మండల పరిషత్ కార్యాలయం సభా మందిరంలో శుక్రవారం మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన,పశుసంవర్ధక శాఖ,పంచాయతీ రాజ్, రెవెన్యూ,విద్యుత్ శాఖలకు చెందిన అధికారులతో వివిధ అంశాల గురించి సమీక్షించారు. రానున్న దాళ్వా సీజన్ లో నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు సాగుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్య వేణి,జడ్పిటిసి పుట్ట పూడి వీర వెంకట సూర్యనారాయణ, ఆలమూరు వ్యవసాయ సహాయ సంచాలకులుసిహెచ్   కె వి చౌదరి,ఎంపీడీవో వెంకటరామన్,తహసిల్దార్ దుర్గారావు,ఏవో రమేష్ కుమార్,ఉద్యాన అధికారి అమర్నాథ్,సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.

Comment here