Andhra PradeshEast GodavariNews

*మంత్రి పదవి కోసమే భజన తప్ప అభివృద్ధి పై అమర్నాథకు ఆరాటం లేదు:*

*మంత్రి పదవి కోసమే భజన తప్ప అభివృద్ధి పై అమర్నాథకు ఆరాటం లేదు:*
.. విశాఖ టీడీపీ పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి కసిపల్లి శ్రీనివాసరావు
————————————————————
ఉత్తరాంధ్ర రక్షణ-చర్చా వేదికను చూసి  విశాఖ వైసీపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారని  విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి కసిపల్లి శ్రీనివాసరావు అన్నారు.అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ ఉత్తరాంధ్ర అభివృద్ధి పై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించునట్లు ఉందన్నారు.వైసీపీ దృష్టిలో అభివృద్ధి అంటే శాండ్, ల్యాండ్-వైన్,మైన్స్ వీటి మీద దోచుకోవడమే అనుకుంటున్నారా? అని
నిలదీశారు.టిడిపి నాయకులు చెంచాగిరి చేస్తున్నారు అంటున్న గుడివాడ తమరు కూడా టీడీపీలో ఉన్నప్పుడు ఎంత చెంచాగిరి చేశారో చెప్పాలని…చెంచాగిరి,భజన చేయడం అది వైసీపీ పార్టీ పేటెంట్ రైట్స్..అని సిగ్గుపడాల్సిన ది టిడిపి
కాదు వైసీపీ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు.
టీడీపీ దేనికి సిగ్గు పడాలి..అంతర్జాతీయ, జాతీయ సంస్థలు విశాఖకు తీసుకువచ్చినందుకా..?? స్టీల్ ప్లాంట్,గంగవరం పోర్టు మీరు అమ్మినట్టు మేము అమ్మలేనందుకా..?? సకాలంలో పెన్షన్లు అందరికి ఇచ్చినందుకా?మేము పన్నులు పెంచలేనందుకా..? అందరికి టిడ్కో ఇల్లులు ఇచ్చినందుకా..?? అమర్నాద్ కు మంత్రి పదవి మీద వ్యామోహం తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి చిత్తశుద్ధి లేదు..టీడీపీ ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చామో, ప్రాజెక్టులు ఎన్ని కట్టామో మాకు చెప్పుకునే దమ్ము ఉంది..మీకు ఉందా అసలు మీరు ఏం చేశారని చెప్పుకోవడానికి..? అసలు మీది కాంగ్రెస్ పార్టీనా లేక వైసీపీ పార్టీనా ప్రజలకు చెప్పాలి..దేశ చరిత్రలోనే రెండున్నర ఏళ్ళ పరిపాలనను ప్రజలు అసహ్యహించుకునే పార్టీ,ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ అనే చెప్పాలి..కళ్ళు తెరిచి చూస్తే వైసీపీ నాయకులకు ఎవర్ని ప్రజలు అసహ్యహించుకుంటున్నారో తెలుస్తుంది.. సిట్ కమిషన్ వేసి ఏం వెలగబట్టారు,ఓట్ల కోసం సీట్లు కోసం తప్ప మీరు ఒక్కటైన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేసారా..?? వైసీపీ నాయకులు రోజు ఉత్తరాంధ్ర షాడో ముఖ్యమంత్రి ఎంపీ విజయసాయిరెడ్డి కి భజన,చెంచాగిరి చెయ్యటానికి మీరు పాకులాడుతున్నారు కానీ మీ విశాఖకు వెలగబట్టింది ఏంటి..?? అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు..మీరూ చేసిందల్లా ప్రజలకు పనికి వచ్చే ఆస్తులను ద్వంసం చెయ్యడం-కూల్చడం..విశాఖలో నెలకొన్న లులూ గ్రూప్, ప్రాంక్లింటెన్ టెంపుల్, హెచ్ఎస్ బిసి,ఐటీ సెజ్,ఆదాని సెంటర్ లాంటి సంస్థలు ను భయపెట్టి పక్క రాష్ట్రలకు పంపించేసి,విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు అమ్మేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎలా చేస్తారో భజన మండలి నాయకుడు గుడివాడ అమర్నాద్ ప్రజలకు చెప్పాలి అని కసిపల్లి డిమాండ్ చేశారు.

Comment here