Andhra PradeshEast GodavariNews

మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాదుదాం 

భక్తితో
మట్టి గణపతులను పూజిద్దాం
పర్యావరణాన్ని కాపాదుదాం
వెలగల విశ్వేశ్వరరెడ్డి.
 చింతా శ్యామ్
కోస్తా ఎన్ కౌంటర్,ఆత్రేయపురం
 పర్యావరణాన్ని పాడుచేసే రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగించకుండా సహజ సిద్ధమైన మట్టితో తయారు చేసే వినాయకుని పూజించడం ద్వారా నిజమైన వినాయక చవితిని జరుపుకోవాలని రావులపాలెం కె. ఎస్. ఆర్. టెంట్ అండ్ డెకరేషన్ అధినేత వెలగల కాశీ విశ్వేశ్వర రెడ్డి అన్నారు.ఆత్రేయపురం మండలం పరిధిలోని ర్యాలీ గ్రామంలో గురువారం నాడు స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద శ్యామ్ మాయ ఈ బడి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గణపతి ప్రతిమలను పంపిణీ చేసిన అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి మట్టి గణపతిని పూజించాలని ఆ ప్రతిమల వల్ల కలిగి లాబాలను వివరించి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్, అన్నపూర్ణ, పసలపూడి నాగేశ్వర రావు, గెడ్డం వెంకట్రావు, ఆత్మకూరు శేషయ్య, మేస్త్రీ నాగు,తదితరులు పాల్గొన్నారు.

Comment here