Andhra PradeshEast GodavariNews

మరల అక్రమాలు జరిగితే బాద్యులు ఎవరు?

కోస్తా ఎన్ కౌంటర్ ఎటపాక :మరల పాత గుత్తే దారుడు ద్వారా అంగన్వాడీ పాలు సరఫరా చేస్తే మరల అక్రమాలు జరిగితే బాద్యులు ఎవరు? అసలు పాలు అక్రమణ జరుగుటకు కారకులు ఎవరు? ఏపీ డైరీ సేల్స్ మేనేజర్ రా?  తూర్పు గోదావరి జిల్లా కాంట్రాక్టర్ రా? బినామీ పేరుతో పాలను సరఫరా చేసే పాల గుత్తే దారుడా? గుత్తే దారుడి కి సహకారం అందిస్తున్నారనీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలా? పాల గుత్తే దారుడు ఒక్కసారి కాదు రెండు సార్లు అక్రమాలు  చేసి అడ్డం గా దొరికిన  మరల అదే గుత్తే దారుడు సొంత గోడౌన్ లో పాలు స్టాక్ దించి పాలు సరఫరా చేయిస్తాం అంటున్న అధికారులు?   తూర్పు గోదావరి జిల్లా చింతూరు, ఎటపాక, వీ ఆర్ పురం, కూనవరం మొదలైన మండలాల లో అంగన్వాడీ కేంద్రాలలో పాలు సరఫరా చేయకుండా అట్టి పాలును ఇతర రాష్ట్రాలలో అమ్ముకుంటున్నడని అధికారులుకు తెలియ పరిచిన అలాంటి అక్రమాలు జరగవని అంగన్వాడీ కార్యకర్తలు అనటం ఈ పాలు సరఫరా చేసే గుత్తే దారునితో వీరి పాత్ర ఉందనే తేటతెల్లం అయిందనే చెప్పాలి….. వివరాలు లోకి వెళితే గత రెండు నెలలు గా మన్యంలో జరుగుతున్న అంగన్వాడీ పాలు సరఫరాలో భాగంగా అనుమతి లేకుండా పాలు స్టాక్ పాయింట్లు పెట్టి ఇతర రాష్ట్రాలలో అంగన్వాడీ పాలు  అమ్మడానికి రెండు వాహనాలు ద్వారా పాలు వాహనాలను చింతూరు ఐ టీ డి ఏ పీ ఓ ఆదేశాల తో రెవిన్యూ అధికారులు పట్టుకొని అట్టి వాహనాలు సీజ్ చేయడం జరిగింది. పాలు గుత్తే దారుడు పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో చింతూరు పీ ఓ ఆకుల. వెంకటరమణ అర్ధరాత్రి ఎటపాక మండలంలో గుండాల కాలనీ లో ఉన్నా పాల గుత్తే దారుడు పాలు గోడౌన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా అందులో కొన్ని పాలు బాక్స్ లకు బ్యాచ్ నెంబర్లు, కొన్నిటికి బ్యాచ్ నెంబర్లు లేనట్టుగా ఆకుల. వెంకటరమణ నిర్ధారణ చేయడం జరిగింది.ఈ పాలు బాక్స్ లు కొన్నిటిని శాంపిల్ తీసుకోని పరీక్షలుకు పంపామన్నారు.పాలు గోడౌన్ లో ఉన్నట్టు వంటి పాలను రెవిన్యూ మరియు, ఐ సీ డి ఎస్ సిబ్బంది పూర్తిగా స్వాధీనం ఈ పాల గుత్తే దారుడు ను తొలగించమనీ చింతూరు పీ ఓ ఆకుల. వెంకటరమణ తెలిపారు. మరల వారం రోజులు గడిచిన తరువాత పాల అక్రమాలు కు పాల్పడిన గుత్తే దారుడు పాలు సరఫరా చేస్తుంటే పాల గుత్తెదారుడు ను తొలగించరుగా మరల ఎందుకు పాలు సరఫరా చేస్తున్నాడని ఐ సీ డి ఎస్ అధికారి సీ డి పీ ఓ.. శంసాధాబేగం మాకు మరల అదే పాల గుత్తెదారుడు తో అతని వాహనాలతో, అతని కూలీలతో పాలు సరఫరా చేయమని చెప్పారని వివరణ ఇచ్చారు. అదే విషయాన్నీ చింతూరు ఐ టి డి ఏ పీ ఓ ను వివరణ అడగగా వీటిని సరఫరా చేయాలంటే పాల స్టాక్ గోడౌన్, వాహనాలు, కూలీల ఖర్చులు అవసరం అనీ వివరణ ఇచ్చారు. కానీ ఏజెన్సీ లో ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు మాత్రం తూర్పు గోదావరి జిల్లా పాల కాంట్రక్టర్ రే వీటిని భరించాలి. లేదా నూతన గుత్తే దారుడిని నియమించాలి. అంతే కానీ అక్రమాలుకు పాల్పడిన వ్యక్తి చేత ఎందుకు సరఫరా చేయిస్తారో ఏజెన్సీ వాసులుకు అర్థం కానీ విషయంగా మారింది. కనుక చింతూరు ఐ టి డి ఏ పీ ఓ ఆకుల. వెంకటరమణ గారు అసలు కాంట్రాక్టర్ చేతనే ఆ పాలు సరఫరా చేయాలి. ఎందుకంటే దానికి బాద్యుడు అతనే కాబట్టి అతని ద్వారా పాలు సరఫరా చేయాలి.లేదా నూతన గుత్తే దారుడితో మాత్రమే పాలు సరఫరా చేయండి అంతేకాని పాత గుత్తే దారుడితో మాత్రం పాలు సరఫరా చేయవద్దని మరల అతను సరఫరా చేస్తే దొంగ చేతికి తాళాలు అప్పచెప్పినట్టు ఉంటుందనీ మన్యం ప్రజలు అధికారులు ను వేడుకుంటున్నారు.

Comment here