Andhra PradeshEast GodavariNews

మహాలక్ష్మీ అలంకరణలో ముత్యాలమ్మవారు

మహాలక్ష్మీ అలంకరణలో ముత్యాలమ్మవారు
ఫొటో : 10టిపిజి01 : తాడేపల్లిగూడెం మండలం ముత్యాలంపురం శ్రీముత్యాలమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించిన దృశ్యం……
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : మండలంలోని ముత్యాలంబపురం శ్రీముత్యాలమ్మవారిని ఆదివారం మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఏడు లక్షల 99వేల 999 రూపాయలు కరెన్సీ నోట్లతో ఆలయాన్ని, గర్భగుడిని అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలతో పాటు లక్ష కుంకుమార్చనలు జరిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మాకా బాలాజీ, ఆలయ మేనేజర్‌ నామా సూర్యప్రకాశరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. వీరంపాలెం శైవక్షేత్రంలో వేంచేసియున్న బాలాత్రిపుర సుందరీ అమ్మవారిని ఆదివారం కూష్మాండాదేవిగా అలంకరించారు. ఆలయ వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో అర్చకులు పూజా కార్యక్రమాలు జరిపారు. పట్టణంలోని శంకరమఠంలో వేంచేసియున్న సర్వమంగళాదేవిని లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా కుంకుమార్చనలు జరిపారు. ఉమాచంద్రమౌళీశ్వర స్వామివారికి అభిషేకాలు రాయప్రోలు శ్రీనివాస్‌, నాదెళ్ళ చక్రపాణి దంపతులు జరిపించారు. సరస్వతుల జగన్నాథం, కృష్ణమోహన్‌ శర్మ, కుంచగట్ల లక్ష్మోజీ, వేమూరి ఫణి తదితరులు పాల్గొన్నారు.

Comment here