Andhra PradeshEast GodavariNews

మహా చండీ యాగం

శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు శ్రీమతి వేణు దంపతుల స్వహస్తాలతో నీలాద్రి రావు పేట శివాలయంలో  మహా చండీ యాగం
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : దేవీ నవరాత్రుల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట గ్రామ శివాలయంలో మహా చండీ యాగ కార్యక్రమం జరిగింది. .ఈ మహా చండీ యాగ కార్యక్రమం జగ్గంపేట శాసనసభ్యులు  జ్యోతుల చంటి బాబు శ్రీమతి వేణు దంపతుల స్వహస్తాలతో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ శారదా పీఠం నుండి శ్రీశ్రీశ్రీ  విజయేంద్ర సరస్వతి స్వామి ప్రియ శిష్యులు శ్రీ శ్రీ శ్రీ సత్వా నంద స్వామి  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త లోకాలకు సమస్త ప్రాణులకు శక్తినిచ్చే దైవం ఆ జగన్మాతే అని అన్నారు అమ్మవారు ఆశీస్సులు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుందని అటువంటి ఆశీస్సులు మీ ప్రాంతానికి ఆ అమ్మవారు ఇవ్వాలని ఆశీర్వదించారు.  ఈ కార్యక్రమంలో గండేపల్లి మండలం జడ్పిటిసి పరిమి వెంకటలక్ష్మి  బాబు , జగ్గంపేట మండలం జెడ్ పి టి సి శ్రీమతి ఒమ్మి బిందు మాధవి రఘురాం,  గండేపల్లి మండల ఎంపీపీ సెలగల దొరబాబు, మండల పార్టీ అధ్యక్షులు కందుల చిట్టిబాబు వైస్ ఎంపీపీ కుంచె రాజా జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా, ఇళ్ల అప్పారావు కాపు, భూపాలపట్నం ప్రసాద్, పెద్దాపురం డి.ఎస్.పి అరిటాకుల శ్రీనివాస్ దంపతులు, జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు దంపతులు, జగ్గంపేట ఎస్ ఐ ఎస్ లక్ష్మి గండేపల్లి ఎస్ ఐ శోభన్ కుమార్ కిర్లంపూడి ఎస్ ఐ అప్పలరాజు గండేపల్లి మండల ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comment here