Andhra PradeshEast GodavariNews

మహిళను వేధిస్తున్న కేసులో నిందితుడి అరెస్టు

యానం మహిళను వేధిస్తున్న నేపథ్యంలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడ్ని ఆదివారం అరెస్టు చేసినట్లు ఇన్ చార్జ్ ఎస్ఐ బడుగు కనకారావు విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం యానం పట్టణానికి చెందిన పెమ్మడి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కొత్తపేట సమీపంలో నివసిస్తున్న మహిళ ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, ఆమెను కొట్టడంతో పాటు గత కొంతకాలంగా వేధిస్తున్నాడని ఈ మేరకు అతనిపై నాలుగు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారని తెలిపారు.

Comment here