Andhra PradeshEast GodavariNews

మహిళా సాధికారతే జగనన్న లక్ష్యం 

మహిళా సాధికారతే జగనన్న లక్ష్యం
కోస్తాఎన్ కౌంటర్, రామచంద్రపురం : మున్సిపల్ పరిధిలోని పదవ సచివాలయంలో ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి  శ్రీదేవి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజలో ఉండాలని, వారి కోసం ఎన్నో  పథకాలను తీసుకొచ్చారని ఆమె తెలిపారు. రాజకీయ రంగంలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించారని  ఆమె అన్నారు. స్త్రీ ఆర్దికంగా, రాజకీయంగా వికాసం పొందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందనేది సిఎం జగన్ నమ్మకమని ఆమె పేర్కొన్నారు.  రెండు సంవత్సరాల్లో 10వ సచివాలయం నుంచి రెండు కోట్ల 20 లక్షల పైగా వివిధ పథకాల రూపేణా మహిళలకు అందాయని ఈ సందర్భంగా వాడ్రేవు సాయి ప్రసాద్ చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు  పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శులు ఆర్ పి లు, వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

Comment here