Andhra PradeshEast GodavariNews

*మహిషాసుర మర్ధనిగా విజయ దుర్గ అమ్మవారు*

*మహిషాసుర మర్ధనిగా విజయ దుర్గ అమ్మవారు*

 *కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో దేవి శరన్నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు గురువారం మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు పూజలందుకున్నారు. వేద పండితులు చీమల కొండ శ్రీనివాస్ అవధాని, చీమల కొండ వీరావధాని,చక్రవర్తుల మాధవాచార్యులు తదితర పండితులు అమ్మవారికి అభిషేకాలు ,అర్చనలు, దుర్గా అష్టోత్తర సహస్ర నామాలతో, లక్ష్మీ, సరస్వతి అష్టోత్తర నామాలతో కుంకుమార్చనలు నిర్వహించారు. పీఠంలో పరివార దేవతలైన విజయ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ, భవాని శంకర అష్టమ లింగేశ్వర స్వామికి అభిషేకాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నవగ్రహాలకు, దత్త సాయిబాబా లకు అభిషేకాలు, నిర్వహించారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్)ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ అమ్మవారు మహిషాసుర మర్ధని అవతారంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారన్నారు. ఈ అవతారంలో అమ్మవారిని పూజిస్తే కష్టాలు తొలగిపోయి, సుఖ శాంతులు ప్రాప్తించడం తోపాటుగా, సర్వం సిద్ధిస్తాయన్నారు. పీఠంలో విజయ దుర్గ అమ్మవారిని అర్చించే భక్తులంతా సర్వకాల సర్వావస్థలయందు సుఖశాంతుల కలిగి ఉంటారని ఆశీర్వచనాలందజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వి వి. బాపిరాజు, గాదే .భాస్కర నారాయణ ,సత్య వెంకట కామేశ్వరి పి. సత్య కనకదుర్గ , కందర్పహనుమాన్ , సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు .పిఆర్ఓ వాడ్రేవు వేణుగోపాల్( బాబి) ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ గావించారు.

Comment here