Andhra PradeshEast GodavariNews

మానసిక వికలాంగుల పాఠశాలలో  విశ్వ హిందూ పరిషత్ స్థాపన దినోత్సవాలు..

మానసిక వికలాంగుల పాఠశాలలో  విశ్వ హిందూ పరిషత్ స్థాపన దినోత్సవాలు..
—————————————-
శ్రీ కృష్ణాష్టమి, విశ్వ హిందూ పరిషత్ స్థాపన దినోత్సవాలలో భాగంగా  కొంకాపల్లి హరి మనో వికాసకేంద్రం మానసిక వికలాంగుల పాఠశాలలో  వి.హెచ్. పి కోనసీమ జిల్లా ధర్మ ప్రసార విభాగ ప్రముఖ్ రేలంగి కుమార్ శంకర్ గౌడ్ పర్యవేక్షణ లో వేడుకలు నిర్వహించారు. కుమార్ శంకర్ గౌడ్,  ముప్పై మంది మానసిక వికలాంగ విద్యార్థుల చేత ఓంకారము, కృష్ణ నామము జపింపజేసి, రాధా కృష్ణులకు పుష్పార్చన చేయించి పండ్లు, ఆల్ఫాహారం వితరణ చేశారు. వి. హెచ్. పి సభ్యులు కూర్మనాథ్, పి. వీరభద్రరావు, రేలంగి లోకేష్, పాఠశాల నిర్వాహకులు సేవలందించారు.

Comment here