Andhra PradeshEast GodavariNews

మా ఇద్దరిది..గురు శిష్యుల అనుబంధం

మా ఇద్దరిది..గురు శిష్యుల అనుబంధం
`బహుముఖ ప్రజ్ఞాశాలి.. డాక్టర్‌ అల్లు రామలింగాయ్య
`హోమియోపతి.. సంజీవని!`ఈ వైద్యంతో తగ్గని జబ్బే లేదు
`రాజమండ్రితో విడదీయరాని బంధం నాది
`అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి
`హోమియో పతి కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ
కోస్తా ఎన్‌కౌంటర్‌, రాజమహేంద్రవరం ప్రతినిథిÑ ‘మా ఇద్దరిది గురు శిష్యుల అనుబంధం..ఆయన నాకు స్పూర్తి ప్రదాత’ అని డాక్టర్‌ అల్లు రామలింగయ్యను స్మరించారు.. ప్రముఖ హీరో మెగాస్టార్‌ చిరంజీవి. శుక్రవారం పద్మశ్రీ డాక్టర్‌ అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో భాగంగా రాజమండ్రిలోని స్థానిక వై`జంక్షన్‌ అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో ..పద్మశ్రీ అల్లు రామలింగయ్య కాంంస్య విగ్రహాన్ని .. చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ‘మన ఊరి పాండవులు చిత్రం లోనే నాకు అల్లు రామలింగయ్య పరిచయం .అప్పుడే నన్ను వలలో (అల్లుడుగా ) వేసుకున్నారనిపిస్తాది.వానాకాల చదువులు చదివిన రామలింగయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి.ఆయన అనుకుంటే ఏదైనా,సాధించేవారు.నిత్యవిద్యార్ధిగా అల్లు గారు వుండేవారు’ అని గుర్తు చేసుకున్నారు.
హోమియో పతి అల్లుగారితోనే కాదు మా అమ్మగారితోనే నాకు అలవాటు..అప్పట్లో హోమియోపతిని ఉమాపతి గా పలికేవాడ్ని..అల్లు రామలింగయ్య గారి హోమియో మాత్రలివ్వడానికి అనేక ప్రశ్నలు వేసి మందిచ్చేవారు.గ్యాంగ్రెన్‌ వ్యాధులను కూడా రామలింగయ్యగారు నయం చేసేవారు.హుమియోపతిలో ఏ రోగానికి అయినా మందు వుంటుందని చెప్పుకొచ్చారు. ‘నా ఇంట్లో అందరమూ హోమియోపతి ఇప్పటికీ వాడుతూనే వుంటాం.’ అని చిరంజీవి అన్నారు. హోమియోపతిని సంజీవనిగా అభివర్ణించారు చిరంజీవి. అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాలకు అప్పట్లో రూ.2 కోట్లను తన రాజ్యసభ నిధుల నుంచే కేటాయించానని.. అవి తన సొంత డబ్బులు కాదన్నారు.సంజీవని లాంటి హోమియోపతి వైద్యం చిరంజీవిగా ఉండాలని ఆకాంక్షించారు. హోమియోపతి సైడ్‌ ఎఫెక్ట్‌ లు లేని వైద్యం అని.. ఈ వైద్యానికి ప్రాచుర్యం రావాలని అన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి నేలను తలుచుకొని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఇది నేను పుట్టి పెరిగిన గడ్డ అని చెప్పుకొచ్చారు. . ‘నేను నటుడిగా జన్మించింది రాజమండ్రిలోనే అని వివరించారు. నా మొదటి మూడు సినిమాలు రాజమండ్రి ప్రాంతంలోనే చిత్రీకరణ జరిగాయని వివరించారు.. ‘చారిత్రక నగరం రాజమండ్రితో నాకు విడదీయరాని బంధం ఉంది.నా తొలి సినిమా పునాది రాళ్ళు తర్వాత ప్రాణం ఖరీదు,మన ఊరి పాండవులు సినిమాల షూటింగ్‌లు ఇక్కడే జరగడంతో నాకు ఈ ప్రాంతంతో విడదీయరాని బంధం ఏర్పడిరది’ అన్నారు .నా తొలి సినిమా పునాది రాళ్ళు తర్వాత ప్రాణం ఖరీదు, మనఊరి పాండవులు ఇక్కడే నటించానని తెలిపారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మాజీ మంత్రులు ఘంటా శ్రీనివాసరావు కామినేని శ్రీనివాసరావు ఎంపీ కేశినేని నాని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎంపి మాగంటి మురళీ మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Comment here