Andhra PradeshEast GodavariNews

ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ.

ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ.

కోస్తా ఎన్ కౌంటర్, టి నరసాపురం. పశ్చిమగోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం టి నరసాపురం పంచాయతీ వరద ముంపునకు గురైన ఎర్ర చెరువులో నివసిస్తున్న ప్రజలకు జడ్పిటిసి  సామంతపూడి బాల సూర్యనారాయణ, తాసిల్దార్ కె నవీన్ కుమార్, దేవరపల్లి సీతారాం ప్రసాద్ బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని వారు వాపోయారు. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఏదైనా సమస్య ఉంటే నేరుగా మాకు తెలియజేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం సునంద ,ఎంపీపీ డి లక్ష్మి, ఎంపీటీసీలు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గోపి, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Comment here