Andhra PradeshEast GodavariNews

మున్సిపల్‌ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలి

మున్సిపల్‌ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలి
` టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జీ
తాడేపల్లిగూడెం పట్టణంలోని టీడీపీ విధేయులను కలిసి మాట్లాడుతున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జీ……..
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో విజయానికి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల మల్లిఖార్జునరావు (బాబ్జీ) అన్నారు. గురువారం పట్టణంలోని టీడీపీ విధేయులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలన పట్ల ప్రజలు విసుగు చెంది ఉన్నారన్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవన్నారు. వీటికి తోడు విద్యుత్‌ ఛార్జీలు భారం గోరు చుట్టుపై రోకలి పోటు చందంగా తయారైందన్నారు. కానుకల పేరుతో కొంత ఇచ్చి కొండంత లాగేసుకుంటున్న పాలనపై ప్రజల్లో వ్యతిరేక భావం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని ఓడిరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో జరగనున్న అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తమసత్తా చాటుతుందన్నారు. టీడీపీ సీనియర్లు గోపీ ధనరాజు, రెడ్డి, తాతా శ్రీనివాసరావులను కలిసి ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. ఆయన వెంట టిడిపి పట్టణాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరరావు (పెద్ద), పెదతాడేపల్లి సర్పంచ్‌ పోతుల అన్నవరం, మాజీ కౌన్సిలర్‌ కొల్లి రమావతి తదితరులు ఉన్నారు.

Comment here