Andhra PradeshEast GodavariNews

మున్సిపాలిటీ ఎన్నికలను వాయిదా కోరుతూ వినతి పత్రం

యానం మున్సిపాలిటీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్వి సెల్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష ఎమ్మెల్యేలు శనివారం రాజ్ నివాస్ లో ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ వార్డుల రిజర్వేషన్లలో లోపాలతో పాటు, పండుగల మొదలైన నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కోరినట్లు తెలిపారు. అంతకుముందు స్పీకర్ ఆర్వి సెల్వం అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో 2011 జనాభా లెక్కలను విస్మరించి రిజర్వేషన్లు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో యానం ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Comment here