Andhra PradeshEast GodavariNews

“మోడరన్ లో న్యాయ అవగాహన సదస్సు”

మోడరన్ లో న్యాయ అవగాహన సదస్సు”

కోస్తా ఎన్ కౌంటర్, రామచంద్రపురం :  అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని మోడరన్ విద్యాసంస్థల ప్రాంగణంలో “ఆజాదికా అమృత్ మహోత్సవ్” లో భాగంగా న్యాయ అవగాహన సదస్సు  స్ఫూర్తి దాయకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి కమ్ చైర్మన్ కె. మాధవిదేవి,  ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి. వాణిశ్రీ  విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. అతివల రక్షణకై ప్రభుత్వం నేడు అనేక చట్టాలను అమలు చేస్తుందన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దిశ చట్టం గురించి ప్రతీ బాలిక, మహిళ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే మహిళలు  ఏ సమస్యనైనా  ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. నేటి మహిళ ఆకాశమే హద్దుగా విజయ బాటలో పయనిస్తోందని, ఈ పరంపర ఇంకా బలోపేతం కావడానికి అందరూ  కలిసికట్టుగా నడుం బిగించాలని పిలుపు నిచ్చారు. అనంతరం మోడరన్ అధినేత లయన్ జి.వి రావు మాట్లాడుతూ బాలికా విద్యను అందరూ ప్రోత్సాహించాలని, అందుకు మోడరన్ విద్యా సంస్థలు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాయన్నారు. సభాధ్యక్షులు లయన్ జివి రావు డిగ్రీ కళాశాల  ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చట్టాల అవగాహన వల్ల బాలికలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి. సత్యనారాయణ, కె. సాయిరాం చౌదరి, జి. మాణిక్యం, మోడరన్ డిగ్రీ విద్యార్థినిలు పాల్గొన్నారు.

Comment here