Andhra PradeshEast GodavariNews

రాజమండ్రిలో  16 నెలల పాప అపహరణ..??

రాజమండ్రిలో  16 నెలల పాప అపహరణ..??
 అపరిచిత యువతి ఒకటిన్న సంవత్సరాలయ పాపను ఎత్తుకు పోయింది.. రాజమండ్రి  ప్రధాన రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న సంఘటన ఇది..  విశాఖ పట్నం ­- కాచీగూడా ఎక్సెప్రెస్ రైలు రాజమండ్రి స్టేషన్ కు సుమారు  9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వచ్చింది.. డి పోర్ భోగీలో నుంచి ఓ యువతి చిన్నారి పాపను తీసుకు వెళ్ళిపోయింది..  ఒడిష్షారాష్ర్టానికి చెందిన దంపతులు ముగ్గురు పిల్లలతో కలసి  రైలులో ప్రయాణిస్తున్నారు. అదే బోగీలో ప్రయాణీకురాలిగా ఉన్న 30 సంవత్సరాల యువతి పరిచయం పెంచుకుంది.. పాపను ఆడిస్తూ నటించింది.. తల్లిదండ్రులు కూడా తోటి ప్రయాణీకురాలే అనే నమ్మకంతో ఉన్నారు.. రాజమండ్రి స్టేషన్ కి రైలు వచ్చేసరికి ఆ దంపతులు నిద్రలో ఉన్నారు.. ఇదే అదనుగా భావించి చిన్నారి పాపతో అదృశ్యం అయింది.. సిసి పుటేజ్ లో  ఆ యువతి పాపను ఎత్తుకుపోతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి..గులాబిరంగు డ్రస్సు
పసుపురంగు కలిగిన చున్నీ ధరించింది..ఆకుపచ్చనీలిరంగు బ్యాగు భుజాన ఉంది.. ఆచూకీ తెలిసినవారు ఈక్రిందినెంబరుకి తెలియజేయాలని రైల్వే జిఆర్ పి పోలీసులు విజప్తి చేస్తున్నారు.
సమాచారం తెలియజేయాల్సిన ఫోన్ నెంబర్లు..రాజమండ్రి జిఆర్ పి సి.ఐ : 9440627551:  రాజమండ్రి జి ఆర్ పి ఎస్. ఐ.  :9491444022
పోన్ నెంబర్లు మరో సారి..రాజమండ్రి జిఆర్ పి సి.ఐ : 9440627551:  రాజమండ్రి జి ఆర్ పి ఎస్. ఐ.  :9491444022

Comment here