Andhra PradeshEast GodavariNews

రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీ.జి కళాశాల NSS విద్యార్థులచే ‘స్వచ్ఛభారత్ 2.0’

ప్రధానమంత్రి అమృత్ రెండో దశలో భాగంగా పట్టణ స్వచ్ఛభారత్ 2.0 శుక్రవారం నుండి ప్రధానమంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న సందర్భంగా మరియు స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీ.జి కళాశాల NSS విద్యార్థులు రాజమండ్రి లోని మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ ను 02-10-2021 శనివారం ఉదయ 10 గంటలకు శుభ్రపరచడం జరిగింది. మున్సిపల్ గ్రౌండ్ లోనే గాంధీ గారి జయంతి సందర్భంగా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టి కే విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ గాంధీ గారు ఆహింసావాదం ద్వారా భారత దేశానికి స్వాతంత్రం తెప్పించడం మే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలు కూడా దీనినే ఆయుధంగా తీసుకొని వారి వారి దేశాల స్వాతంత్రం గురించి పాటుపడ్డారని, ఈరోజు ప్రధాన మంత్రి గారి చేతుల మీదుగా భారతదేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలు పెట్టారని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛభారత్ కార్యక్రమం మొదలు పెడుతున్నారని అలాగే రాజమహేంద్రవరం నగరంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీ.జీ కళాశాల NSS విద్యార్థులు ఈ మున్సిపల్ కాలనీ లో ఉన్న గ్రౌండ్ ని సుబ్ర పరిచారని, రాజమహేంద్రవరం లో ఉన్న క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా ఈ గ్రౌండ్లో స్టేడియాన్ని నిర్మించడానికి కృషి చేస్తానని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ గారు శ్రీమతి తేతలి సత్య సౌందర్య గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయ పౌరులు గాంధీగారి లోని సేవాభావాన్ని తీసుకొని వారి వారి ఇళ్ల దగ్గరే ఉన్న చెత్తాచెదారాన్ని తీసివేసి స్వచ్ఛభారత్ లో పాల్గొనాలని, అలాగే ప్రతి ఒక్కరూ అహింసా మార్గంలో నడవాలని, తద్వారా భారత దేశ ప్రగతికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. పి. వో లు శ్రీమతి ప్రవీణ మరియు ఎం.కె.ఎస్. ప్రసాద్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విద్యార్థినిలు, ఉపాధ్యాయులు శ్రీమతి సావిత్రి, తేజ, స్వామి మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Comment here