Andhra PradeshEast GodavariNews

రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీ.జి కళాశాల ఎన్.ఎస్. ఎస్ విద్యార్థులచే ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీ.జి కళాశాల ఎన్.ఎస్. ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో 02-10-2021 శనివారం నాడు ఉదయం 11 గంటలకు గాంధీ గారి జయంతి సందర్భంగా గౌతమీ జీవ కారుణ్య సంఘంలోని అనాధ వృద్ధులు మరియు కుష్టురోగుల శరణాలయంలో గాంధీ గారి విగ్రహానికి రాజమండ్రి ఎంపీ గారు మార్గాని భరత్, రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టి.కే. విశ్వేశ్వర్ రెడ్డి గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గౌతమి జీవకారుణ్య సంఘం అనాధ శరణాలయంలో వృద్ధులకు, కుష్టు రోగులకు పండ్లు మరియు టవల్స్ ఎంపీ గారి చేతుల మీదుగా పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మార్గాన్ని భరత్ గారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుంచే సేవాభావం కలిగి ఉండాలని అలా సేవాభావం కలిగినప్పుడే జీవితంలో వారు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు అని అన్నారు. రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి సేవాభావం కలిగి వృద్ధ తల్లిదండ్రులకు, అనాథ వృద్ధులకు సేవ చేసినప్పుడే జీవితానికి ఒక అర్థం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. కె. ఎస్. ప్రసాద్, ప్రవీణ, వైయస్సార్ సిపి నాయకులు కాల భక్తుల రాజశేఖర్, పిల్లి నిర్మల కుమారి, అన్నపూర్ణ, దుoగా సురేష్, మంగ, జీవకారుణ్య సంఘం ఈవో మరియు సిబ్బంది, కళాశాల ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

Comment here