Andhra PradeshEast GodavariNews

రాజవరంలో సారా పట్టివేత

రాజవరంలో సారా పట్టివేత
ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు
కోస్తా ఎన్ కౌంటర్,ఆత్రేయపురం,
జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఆదేశాలు మేరకు ఎస్. ఇ.బి .రమాదేవి
అమలాపురం డిఎస్పీ మాధవ రెడ్డి పర్యవేక్షణలో సీఐలు వి కృష్ణ.అడబాల సతీష్.మోహన రావులు సిబ్బందితో కలిసి బుధవారం నాడు అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు ఆత్రేయపురం మండలం పరిధిలోని రాజవరం గ్రామంలో సారా తయారీ కేంద్రాలను కనుకొని సుమారు 5,750 లీటర్లు బెల్లం ఊటను ద్వంసం చేశారు 295 లీటర్లు నాటు సారాను స్వాధీనం చేసుకుని సారా తయారీకి ఉపయోగించే ఐదు గ్యాస్ సిలిండర్లు,20 కేజీల బెల్లం సామగ్రితో పాటు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్టు సీఐ వి కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సైలు పి బుజ్జిబాబు, బెన్ని రాజు,సురేంద్ర,సిబ్బంది పాల్గొన్నారు

Comment here