Andhra PradeshEast GodavariNews

*రాయవరం ఎంపీపీగా నౌడు వెంకటరమణ ప్రమాణ స్వీకారం*

*రాయవరం ఎంపీపీగా నౌడు వెంకటరమణ ప్రమాణ స్వీకారం*

*విధేయతకు పట్టం గట్టిన పార్టీ నాయకత్వం*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం* రాయవరం మండల పరిషత్ అధ్యక్షుడిగా నౌడు వెంకటరమణ ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీకి విధేయుడు, సౌమ్యుడైన
  వెంకటరమణకు ఎంపీపీ పదవి నివ్వడం విధేయతకు పట్టం గట్టినట్లైంది .శుక్రవారం మండల పరిషత్ సమావేశ హాలులో రిటర్నింగ్ అధికారి డివి కృష్ణ ఆధ్వర్యంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక కార్యక్రమం జరిగింది. ఎంపీపీ గా నౌడు వెంకటరమణ,వైస్ ఎంపీపీ గా గుమ్మడి చంద్రశేఖర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత ఎన్నికల నియమావళి ననుసరించి 12 గ్రామాలకు చెందిన 19 మంది ఎంపీటీసీల చేత ఆర్ వో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 16 మంది వైసీపీ ఎంపీటీసీలు కాగా, ఇరువురు టిడిపి ఎంపీటీసీలుగా,ఒకరు జనసేన తరపున ఎంపీటీసీలు గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక నిర్వహించారు. మండల కేంద్రమైన రాయవరానికి చెందిన పోలుమాటి జేమ్స్ శ్యామ్ సుధాకర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన కోఆప్షన్ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ గా పసలపూడి-1నుండి ఎంపీటీసీగా విజయం సాధించిన కర్రి విజేత నియమింపబడ్డారు. మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో రాయవరం ఎం పి టి సి -1 ప్రాదేశిక నియోజకవర్గం నుండి గెలుపొందిన నౌడు వెంకటరమణను ఎంపీపీ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే సోమేశ్వరం- 2 ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఎన్నికైన గుమ్మడి చంద్రశేఖర్ ను వైస్ ఎంపీపీ గా, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిచేత ఆర్ వో . కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో మల్లపురెడ్డి శ్రీను సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ లను మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు , ఏఎంసీ చైర్మన్ తేతల వనజా నవీన్ రెడ్డి, జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి , డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గొలుగూరి వరలక్ష్మీ, అనపర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేతల సుబ్బిరామిరెడ్డి, కొవ్వూరి త్రినాధ రెడ్డి, మంతెన అచ్యుత రామ రాజు, పులగం శ్రీనివాసరెడ్డి, పడాల కమలా రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు , పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

Comment here