Andhra PradeshEast GodavariNews

రాయవరం ఎంపీపీ నౌడు ను ఘనంగా సత్కరించి పిఎంపీలు

*రాయవరం ఎంపీపీ నౌడు ను ఘనంగా సత్కరించి పిఎంపీలు*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* ఎంపీపీ నౌడు వెంకటరమణను అనపర్తి, బిక్కవోలు, రాయవరం మండలాల పిఎంపీల అసోసియేషన్లు ఆదివారం ఘనంగా సత్కరించాయి. మండల కేంద్రమైన రాయవరం వెలమ కళ్యాణ మండపంలో ఎంపీపీ అభినందన సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా పి ఎంపీల రాష్ట్ర అసోసియేషన్ కోశాధికారి తోరాటి ప్రభాకరరావు, జిల్లా అధ్యక్షుడు గంగుమళ్ళ రాంబాబు మాట్లాడుతూ పి ఎంపీగా వెంకటరమణ ప్రజలకు వైద్య సేవలు అందజేసి వారి మన్ననలందుకున్నారన్నారు. అలాగే ఎంపీపీగా ప్రజా మన్ననలందుకుని ,మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఎంపీపీ వెంకటరమణను పిఎంపిల అసోసియేషన్లు ఘనంగా సత్కరించి ,జ్ఞాపికనందజేశారు. ఈ సత్కార కార్యక్రమం లో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బల్లా శ్రీనివాసరావు, మండల కార్యదర్శి నీలం శెట్టి శ్రీనివాసరావు, మండల కోశాధికారి డి సాయి రామారెడ్డి ,పెదపూడి మండలం అధ్యక్షులు ఎస్ కె బాబ్జి, కార్యదర్శి రేవు రాంబాబు, కాకినాడ సిటీ అధ్యక్షులు కె.
 తాతారావు, వివిధ కార్యవర్గాల సభ్యులు పాల్గొన్నారు

Comment here