Andhra PradeshEast GodavariNews

రాయవరం భాష్యం స్కూల్ విద్యార్థికి హ్యాండ్ రైటింగ్ లో రాష్ట్ర స్థాయి బహుమతి

*రాయవరం భాష్యం స్కూల్ విద్యార్థికి హ్యాండ్ రైటింగ్ లో రాష్ట్ర స్థాయి బహుమతి*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* హ్యాండ్ రైటింగ్ ట్రైనర్స్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాండ్రైటింగ్ పోటీలలో మండల కేంద్రమైన రాయవరం లో ఉన్న భాష్యం పాఠశాల విద్యార్ధికి రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతి వచ్చినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ పి. శ్రీనివాస్ గుప్తా తెలిపారు. జాతీయస్థాయిలో గత నెలలో జరిగిన పోటీల్లో తమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న పడాల సహస్ర అక్షయ రెడ్డి పాల్గొనగా తృతీయ బహుమతి సాధించినట్లు, అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారన్నారు. పోటీలో బహుమతి సాధించిన అక్షయ రెడ్డిని భాష్యం సంస్థల చైర్మన్ రామకృష్ణ, జోనల్ ఇంచార్జ్ గోవిందరాజులు అభినందించారని ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు, హ్యాండ్ రైటింగ్ పట్ల శ్రద్ధ వహించి నేర్చుకుంటే మంచి మార్కులు సాధించవచ్చునన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రైమరీ ప్రిన్సిపాల్ ఎం. కాంచన ,అధ్యాపకులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Comment here