Andhra PradeshEast GodavariNews

*రాయవరం మండలంలో డెంగ్యూ కలకలం*

*రాయవరం మండలంలో డెంగ్యూ కలకలం*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండలంలో జ్వర పీడితుడికి డెంగ్యూ లక్షణాలు బయటపడడంతో అధికార యంత్రాంగం ఒక్క సారిగా ఉలిక్కి పాటుకు గురయింది. మండలంలో చెల్లూరు సచివాలయం-2 పరిధిలోని దంప కాలనీలో జ్వరంతో బాధపడుతున్న తాడాల భద్ర రావుకు రక్త పరీక్షలు నిర్వహించగా, డెంగ్యూ లక్షణాలు బయట పడ్డాయి. అతన్ని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మాచవరం పీహెచ్సీ వైద్యాధికారి ఎం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, కాలనీలో ఫీవర్ సర్వే నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న 10 మంది నుండి రక్త నమూనాలను సేకరించి, పరీక్ష నిమిత్తం పంపించారు. పంచాయతీ సిబ్బంది పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యం పై దృష్టిసారించారు. ఎంపీడీవో మల్లపురెడ్డి శ్రీను కాలనీలో పర్యటించారు. మెరుగైన పారిశుద్ధ్యానికి పంచాయతీ కార్యదర్శి డి .శ్రీనివాస్ కు తగు సూచనలు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భద్ర రావు ఆరోగ్య పరిస్థితిని పీహెచ్సీ వైద్యాధికారి ఎం. శ్రీనివాస్ నడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సబ్ డివిజన్ యూనిట్ అధికారి వెంకట సత్యనారాయణ కాలనీలో పర్యటించి జ్వర పీడిత వివరాలను డాక్టర్నడిగి తెలుసుకున్నారు. వారం రోజుల పాటు కాలనీలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని డాక్టర్ శ్రీనివాస్ కు సూచించారు. పంచాయతీ విస్తరణాధికారి బి. అశోక్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చైతన్య కుమారి, ఎంపిడిఓ వెంట ఉన్నారు.

Comment here