Andhra PradeshEast GodavariNews

రాష్ట్రంలో ప్రజలకే కాదు… విగ్రహాలకు రక్షణ లేదా..?

రాష్ట్రంలో ప్రజలకే కాదు… విగ్రహాలకు రక్షణ లేదా..?
– 31వ వార్డులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం, అపహరణ పట్ల స్పందించిన టీడీపీ నేతలు
– సెంట్రల్ డీఎస్పీకి ఫిర్యాదు చేసిన నేతలు
రాజమహేంద్రవరం సిటీ :
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజలకే కాకుండా మహానీయుల విగ్రహాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. స్థానిక 31వ వార్డు అన్నపూర్ణమ్మ పేటలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం దిమ్మను ధ్వంసం చేసి, విగ్రహాన్ని అపహరించుకుపోయిన ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), యర్రా వేణు గోపాల రాయుడులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అక్కడ జరిగిన సంఘటనను ఖండించారు. ఎన్టీ రామారావు విగ్రహం దిమ్మను ధ్వంసం చేయడం, విగ్రహాన్ని అపహరించుకుపోవడాన్ని పిరికి పంద చర్యగా అభివర్ణించారు. అక్కడ విగ్రహం కొత్తగా ఏర్పాటు చేసింది కాదని పాత దిమ్మకు మరమ్మతులు చేసి పాత విగ్రహాన్నే ఏర్పాటు చేస్తే గిట్టని వాళ్లు ఈ చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఇటువంటి చర్యలకు తామే కనుక పూనుకుని ఉంటే ఒక్క విగ్రహం కూడా ఉండేది కాదన్నారు. రాత్రికి రాత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని మాయం చేసి రాజమహేంద్రవరంలో కొత్త రాజకీయానికి తెరలేపారన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని అపహరించడానికి ఆయనేమైనా తప్పు చేశారా అని ప్రశ్నించారు. తెలుగు వాడి కీర్తిని ఢిల్లీ స్థాయిలో తెలియచేసిన వ్యక్తి ఎన్టీ రామారావని, అటువంటి జాతీయ స్థాయి నాయకుడి విగ్రహాన్ని మాయం చేసిన దుండగులు ఎవరనేది తెలియాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు మాట్లాడుతూ విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నగరంలో ఇటువంటి సంస్కృతి ఎన్నడూ లేదని, అందరం గౌరవంగానే ముందుకు వెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, 31వ వార్డు టీడీపీ కమిటీ సభ్యులు పల్లా సత్యనారాయణ, వీరా రాము, మీసాల నాగమణి, నాయుడు మాస్టారు, కిలపర్తి నాగభూషణం, వంకర రాజులమ్మ, కొసరు శ్యామ్, శనపతి సత్తిబాబు, పైలా రాంబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, కార్యదర్శి కడితి జోగారావు, తెలుగు మహిళా రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల, మాజీ కార్పొరేటర్ రాచపల్లి ప్రసాద్, లీగల్ సెల్ సభ్యులు నర్సింగ్ శ్రీనివాస్, సురేంద్ర ప్రసాద్, బేసరి చిన్ని, తుల్లి పద్మ, పోసుపో శేఖర్, తలారి భాస్కర్, సుధీర్, సిరిగిడి పైడిరాజు, మరియ, రాచర్ల రమణ, కెసిఎన్ చిన్న, వల్లూరి నిర్మల, కంది ప్రకాష్, చాపల చిన్ని రాజు, దుత్తరపు గంగాధర్, కానేటి ప్రభు, కానేటి కృపామణి, నాగరాజు, బాలిపల్లి ఆదిలక్ష్మి, బలగం సీత తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ డీఎస్పీకి ఫిర్యాదు :
కాగా 31వ వార్డు అన్నపూర్ణమ్మ పేటలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసి, అపహరించుకుపోయిన ఘనటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు సెంట్రల్ జోన్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. విగ్రహం దిమ్మను ధ్వంసం చేసి, విగ్రహాన్ని అపహరించుకుపోయిన వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.

Comment here