Andhra PradeshEast GodavariNews

రాష్ట్ర స్థాయి రగ్బీ 2021 ఛాంపియన్ షిప్ బాలుర విజేత నెల్లూరు

రాష్ట్ర స్థాయి రగ్బీ 2021 ఛాంపియన్ షిప్ బాలుర విజేత నెల్లూరు, బాలికల విజేత ప్రకాశం.
గాడిమొగ పంచాయతీ, గాడిమొగ జడ్పీ హైస్కూల్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ 2021 ముగింపు వేడుకలు సందర్భంగా జరిగిన బహుమతుల ప్రధానోత్సవం లో ఎమ్మెల్యే మాట్లాడారు. స్థానిక పెన్మెత్స వెంకటకృష్ణంరాజు క్రీడా ప్రాంగణంలో జరిగిన పోటీలు హోరాహోరీగా ముగిసాయి.
క్రీడాకారులు నిరంతర కృషితో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుని పుట్టిన ఊరికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పేర్కొన్నారు. .ముందుగా క్రీడాకారులతో కరచాలనం చేసి ఫైనల్ పోటీలను ప్రారంభించారు.ఈ పోటీలలో బాలుర విభాగంలో నెల్లూరు జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, తూర్పు గోదావరి జిల్లా ద్వితీయ, వైజాగ్ తృతీయ స్థానంలో నిలిచారు. అదేవిధంగా బాలికల విభాగంలో ప్రకాశం జిల్లా ప్రథమ, విశాఖపట్నం జిల్లా ద్వితీయ, తూర్పుగోదావరి జట్టు తృతీయ స్థానంలో విజయ కేతనం ఎగురవేశారు.అనంతరం ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు అందజేసి, క్రీడలకు సహాయ సహకారాలు అందించిన వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రగ్బీ కార్యనిర్వాహక అధ్యక్షులు కామాడి గోవ లక్ష్మి మాత రాజు, ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, మండల అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్,
ఐ పోలవరం జడ్పిటిసి ముదునూరి సతీష్ రాజు, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు టిల్ల పూడి నాగేశ్వరరావు సర్పంచులు, స్థానిక నాయకులు,అభిమానులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comment here