Andhra PradeshEast GodavariNews

రూ 10వేలు దుష్ప్రచారంపై చర్యలు చేపట్టాలి 

రూ 10వేలు దుష్ప్రచారంపై చర్యలు చేపట్టాలి
 తహసీల్దార్ కార్యాలయంలో రూరల్ బిజెపి వినతి పత్రం అందజేత
    రాజమండ్రి రూరల్ పరిధిలో గల ఈ సేవ, మీ సేవ, అలాగే  సి.ఎస్.సి కేంద్రాలలో  భారత ప్రధాని ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ యోజన పథకం కార్డ్ నమోదు చేస్తూ  ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పది వేలు ఎకౌంట్లో వేస్తారని ప్రజలను మభ్యపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతాపార్టీ రాజమండ్రి రూరల్ శాఖ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యానాపు ఏసు, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రొంగల గోపి శ్రీనివాస్, జిల్లా ఓబిసి నాయకులు, డీ.రుక్క, ఇంచార్జ్ కాలేపు సత్య సాయిరాం, పిల్లాడి రుద్రయ్య, తనుబుద్ధి సూర్య భాస్కరరావు, ఎన్.వీ.బీ.ఎన్. ఆచారి, డాక్టర్ మూర్తి, మల్లాడి వరప్రసాద్, మువ్వల శ్రీలక్ష్మి, తంగెళ్ల శ్రీనివాసరావు, మజ్జి సాయి తదితరులు పాల్గొన్నారు. రూ 10వేలు ఎక్కౌంట్ లో పడతాయని మభ్యపెట్టి,   130 రూపాయలు నుండి 300 రూపాయల వరకు అక్రమ వసూళ్లు చేస్తున్నారని అలాగే  కేంద్ర ప్రభుత్వం పథకాల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసేవ మీసేవ సి ఎస్ సి ల లో అక్రమ రుసుము వసూలు చేస్తున్న ఆపరేటర్లపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.  అలాగే ప్రతి సేవ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం తరఫున అధికారికంగా సేవ రుసుముల పట్టిక  ఏర్పాటు చేయాలని కోరారు.

Comment here