Andhra PradeshEast GodavariNews

రేషన్ బియ్యం అక్రమ రవాణా పై కేసు నమోదు

రేషన్ బియ్యం అక్రమ రవాణా పై కేసు నమోదు
* ఎంఎస్ ఓ దివాకర్ వెల్లడి

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం: రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పై కేసు నమోదు చేసినట్లు ఎంఎస్ ఓ దివాకర్ తెలిపారు. మంగళవారం గోకవరం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న బియ్యం బస్తాలను, బైక్ ని పరిశీలించారు. దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి సమయంలో గోకవరం మండలం కృష్ణుని పాలెం నుండి రేషన్ బియ్యం తరలిస్తుండగా వాలంటీర్లు, నాయకులు బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. వీటిని  స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.. బియ్యం 200 కేజీలు ఉంటాయని, బియ్యంతో పట్టుబడ్డ వారిని ప్రశ్నించగా తమకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి ఈ బియ్యం ఇచ్చినట్లు చెప్పినట్లు తెలిపారు. ఇవి రేషన్ బియ్యం అని తమకు తెలియదని చెప్పారని ఎంఎస్ ఓ దివాకర్ తెలిపారు. బియ్యం పట్టుబడ్డ సమీపంలో 34 నంబర్ షాప్ ఉందని, సంబంధిత డీలర్ ని ప్రశ్నించగా తనకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం 34 రేషన్ షాప్ పై కేసు నమోదు చేయడం జరుగుతుందని, అలాగే బైక్ పై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Comment here