Andhra PradeshEast GodavariNews

*రైతులంతా ఎవరికి వారే విత్తనోత్పత్తి చేసుకోవాలి*

*రైతులంతా ఎవరికి వారే విత్తనోత్పత్తి చేసుకోవాలి*

*వ్యవసాయ అధికారి ఇందిరా ఝాన్సీ*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:*రైతులంతా స్వయం విత్తనోత్పత్తి చేసుకోవాలని పెద్దాపురం రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారిణి వై ఇందిరా ఝాన్సీ సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన రాయవరంలో భరోసా కేంద్రం వద్ద గ్రామీణ విత్తనోత్పత్తి పథకం పై రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయాధికారి కె ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగినకార్యక్రమంలో పెద్దాపురం రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయాధికారిణి వై. ఇందిరా ఝాన్సీ పాల్గొని మాట్లాడుతూ
రైతులందరూ ప్రతి పంటకు తమ పొలంలో, తరువాత పంట విత్తనాలను పండించు కోవాలన్నారు .దీనివలన నాణ్యతతో కూడిన తెగుళ్లు, లేని మంచి విత్తనాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.
ఈ విధానం వల్ల నకిలీ విత్తనాల బెడద తప్పుతుందన్నారు.
విత్తనం వేసినప్పుడు తప్పనిసరిగా సూడోమోనాస్ మందు తో విత్తనశుద్ధి చేసుకోవాలని, దీనివలన పంటకురక్షణ కలగడంతో పాటు, పెట్టుబడి ఖర్చు కూడా తగ్గించుకోవచ్చునన్నారు.పంట కోసే లోపల రెండు సార్లు కేలిల ను తొలగించి, కోత సమయంలో జాగ్రత్తలు తీసుకుని, విత్తనాలను సేకరించి గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రసాయనిక ఎరువులు ,పురుగు మందుల మీద ఆధారపడకుండా పశువుల పెంట మరియు జీవన ఎరువులు, ఉపయోగించి, ఆరోగ్యకరమైన పంట పండించే దిశగా రైతులు చైతన్యవంతులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్ర మల్ల రామకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయశాఖ సూచించిన విధంగా రైతులు సాంకేతిక పద్ధతులను ఉపయోగించి విత్తనోత్పత్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు మణికంఠ, ఐశ్వర్య దేవి పాల్గొన్నారు.

Comment here