Andhra PradeshEast GodavariNews

రైతుల హత్యకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే

రైతుల హత్యకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే
– సీపీఐ ధర్నాలో నగర కార్యదర్శి నల్లా రామారావు
విశాలాంధ్ర- రాజమహేంద్ర వరం : రైతులు చేస్తున్న పోరాటాన్ని  విచిన్నం చేయాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించ
క పోవడంతో  నేరుగా దాడులకు, హత్యలకు పూనుకుంటున్నారని , ఉత్తర ప్రదేశ్ లో రైతుల మరణాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని
‌సీపీఐ  నగర కార్యదర్శి నల్లా రామారావు డిమాండ్ చేశారు. రైతులను చంపిన  కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆసీస్ , అనుచరులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రి ని భర్తరఫ్ చేయాలనే డిమాండ్ తో సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో మంగళవారం
‌పార్టీ కార్యాలయం నుండి తాడితోట కార్ల్ మార్క్స్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అక్కడే ధర్నా చేసి నిరసన తెలిపారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఢిల్లీలో సుమారు పది నెలలుగా
‌ఆందోళన   కొనసాగిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం మానేసి చర్చల పేరుతో కాల యాపన చేయడం దుర్మార్గ మన్నారు.  ఆదివారం ఉత్తరప్రదేశ్ లో   శాంతియుతంగా  ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా తనుడు ఆశిష్    తుపాకులతో కాల్చి, కారు ఎక్కించి సుమారు 10 మంది చావుకు కారకులు కావడం అమానుషమని  అన్నారు. రానున్న  5 రాష్ట్రాల ఎన్నికల్లో  బీజేపీ కి రైతులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.  ఈ కార్యక్రమం లో సీపీఐ నగర సహాయ కార్యదర్శి
 వంగమూడి కొండల రావు,  జట్లు లేబర్ యూనియన్ అద్యక్షులు కూండ్రపు రాంబాబు, కార్యదర్శి సప్పా రమణ, గొంటి వెంకట్రావు, పెంటు దేముడు బాబు, సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు బొమ్మసాని రవి చంద్ర, ముప్పన వీర భద్ర రావు, సిడగం నౌరోజి,  ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు
నల్లా భ్రమరాంబ, సేపెని రమణమ్మ, కే. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comment here