Andhra PradeshEast GodavariNews

*రోడ్లు నిర్మించండి మహాప్రభో…*

*రోడ్లు నిర్మించండి మహాప్రభో…*

*ప్రజా గోడు ఆలకించండి*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:*
అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉండటం వల్ల టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టిడిపి రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రిమ్మలపూడి వేణుగోపాల దొర, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ఉపాధ్యక్షుడు వై ఆర్ కే పరమహంస, రాయవరం మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి,తదితర పార్టీ శ్రేణులఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. లొల్ల గ్రామం నుండి రాయవరం వరకు అద్వానంగా ఉన్న ఎస్ ఆర్ రోడ్ మరమ్మతు పనులు చేపట్టి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లు నిలువెత్తు గోతులతో అధ్వానంగా ఉండి ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. వాహన దారులు పలువురు గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం టిడిపి శ్రేణులు రహదారి గోతులను పూర్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వైట్ల సతీష్, వుండవిల్లి సుబ్బారాయుడు, మాజీ జడ్పీటీసీ కాదా ప్రభాకర్ రావు, వెదురుపాక మాజీ సర్పంచ్ కొండేపూడి సత్యప్రభ , మాజీ ఎంపిటిసి పిల్లి గణేష్, భోగిళ్ళ సతీష్ , సుంకవల్లి గంగరాజు, మేడపాటి రవీందర్ రెడ్డి , కోడి చిన్న అప్పారావు, నూలు వీరవెంకట సత్యనారాయణ మండలంలోని పలు గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comment here