Andhra PradeshEast GodavariNews

లంకాలపల్లి నుండి వేలేరు వరకు రోడ్లు తక్షణమే వేయాలి:

లంకాలపల్లి నుండి వేలేరు వరకు రోడ్లు తక్షణమే వేయాలి:
 సీపీఎం మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేంద్రరావు:
కోస్తా ఎన్కౌంటర్ కుక్కునూరు:
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నాడు రోడ్ల సమస్యలు పరిష్కరించాలని ప్రధాన రహదారి వద్ద ధర్నా చేయడం జరిగింది. అనంతరం నాగేంద్రరావు మాట్లాడుతూ,రాష్ట్ర విభజన తర్వాత విలీన మండల ప్రజలపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతుందని దాంట్లో భాగంగానే మండలంలో అభివృద్ధి పూర్తిగా నిలిపివేసింది అని అన్నారు. ఈ రోడ్లో ప్రయాణాలు చేయాలంటే ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని భయం భయం గా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది,గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ లో వెళ్లాలంటే మధ్యలోనే ప్రసవాలు అయ్యేలాగా లేదా ప్రాణాలు పొయ్యేలాగా రోడ్లు ఉన్నాయి అని,నడుములోతుల్లో గోతుల రోడ్లు ఉన్నాయని గతం లో రోడ్లు మరమ్మతుల పేరుతో నిధులు విడుదల చేసి పనులు చేయమంటే అంతంత మాత్రంగా చేసి పట్టించుకోకుండా మానేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ఈ రోడ్లో ప్రమాదాలు జరుగుతున్నాయి అని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గతంలో 48 కోట్లు కొత్త రోడ్ల కోసం విడుదల చేసాము అని చెప్తున్న ప్రభుత్వం, పనులు ఎందుకు చేయడం లేదని నాగేంద్రరావు ప్రశ్నించారు. ప్రజల నుండి పన్నులు తీసుకుని ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని,ఇదేనా నేను విన్నాను నేను ఉన్నాను అన్న అభివృద్ధి అని విమర్శించారు, ప్రభుత్వం ఇప్పటికైనా అలసత్వం వీడి వెంటనే లంకాలపల్లి నుండి వేలేరు వరకు కొత్త రోడ్లు వేసి,పల్లె వెలుగు బస్సులు నడపాలని నాగేంద్రరావు డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ ధర్నా లో మహబూబ్ పాషా, పట్ల లక్ష్మయ్య, రాముడు, తిరోజుల సురేష్, సాయిరాం, కడారి తిరపతయ్య, కూరకుల తిరుపతిరావు, ఎమ్.డి ఫుల్లు, కారం రాముడు తదితరులు పాల్గొన్నారు

Comment here