Andhra PradeshEast GodavariNews

లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం

లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం
– లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే భవాని
రాజమహేంద్రవరం సిటీ :
సమాజ సేవల్లో లయన్స్ క్లబ్ ప్రశంస నీయమైన సేవలు అందిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ పేర్కొన్నారు. కందుకూరి వీరేశలింగం రీజియన్ ఛైర్మన్ లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు గారి అధ్యక్షతన పుష్కరాల రేవు వద్ద శ్రీ కన్యా గ్రాండ్స్లో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులకు… ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేసే నాయకులని తయారు చేయడం ద్వారా లయన్స్  ఎంతో ఉన్నత ఆశయాల కోసం పనిచేస్తుoదని భవాని అన్నారు. అంతర్జాతీయ స్వచ్చంద సేవా సంస్థ అయిన లైన్స్ క్లబ్ ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలో ప్రతిభావంతులను, గుర్తింపునకు నోచుకోని వారిని పిలిచి సత్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. లైన్స్ క్లబ్నకు సంబంధించిన కందుకూరి వీరేశలింగం రీజియన్ ఛైర్మన్ లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో గురువులకు ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, లయన్స్ క్లబ్ ద్వారానే కాకుండా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ద్వారా గుబ్బల రాంబాబు గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయన భవిష్యత్తులో మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎంపిక చేసిన సుమారు 15మంది ఉపాధ్యాయలను సత్కరించారు. లయన్స్ పూర్వపు గవర్నర్ లు గ్రంధి వెంకటేశ్వర రావు,బీ వీ న్ రెడ్డి జోన్ ఛైర్మన్ లు Y.నల్లబాబు,m. చిన్న బాబు లయన్స్ వివిధ క్లబ్ ల అధ్యక్షులు సత్యవేని,భాస్కర్,I E కుమార్,p. రామి రెడ్డి, శ్యామ్,భరణి,రామ కృష్ణ,వసంత,తదితరులు పాల్గొన్నారు.

Comment here