Andhra PradeshEast GodavariNews

*లలితా త్రిపుర సుందరీ దేవిగా పూజలందుకున్న విజయ దుర్గ దేవి*

*లలితా త్రిపుర సుందరీ దేవిగా పూజలందుకున్న విజయ దుర్గ దేవి*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో దేవి శరన్నవరాత్రుల్లో నాలుగవ రోజైన ఆదివారం విజయ దుర్గ అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరింపబడి పూజలందుకున్నారు. వేద పండితులు చీమల కొండ వీరాభిమాని, చీమల కొండ శ్రీనివాసావధాని, చక్రవర్తుల మాధవాచార్యులు తదితర పండితులు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజాము నుండి అభిషేకాలు ,అర్చనలు, అష్టోత్తర సహస నామాలతో పూజలు నిర్వహించారు. అలాగే వినాయక పూజ, నవగ్రహారాధన, సుబ్రమణ్యేశ్వర స్వామికి అభిషేకాలు, విజయ వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు అర్చన, భవానీ శంకరునికి, అష్టమి లింగేశ్వర స్వామికి అభిషేకాలు ,దత్త, సాయి బాబా తదితర పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ లలితా త్రిపుర సుందరి దేవిని అర్చించడం వల్ల ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, శాంతి సౌభాగ్యాలు, సిద్ధిస్తాయని, పాడిపంటలతో లోకం సుభిక్షంగా ఉంటుందని ఉద్బోధించారు. ఈ కార్యక్రమాల్లో పీఠం అడ్మినిస్ట్రేటర్ వివి. బాపిరాజు, గాదె సత్య వెంకట కామేశ్వరి, గాదె భాస్కర నారాయణ, పి. సత్య కనకదుర్గ, పి ఆర్ వో బాబీ, కందర్ప హనుమాన్ విజయ దుర్గ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Comment here