Andhra PradeshEast GodavariNews

వాడపల్లి వెంకన్న స్వామిని దర్శించుకున్న చిర్ల.. విప్పర్తి

వాడపల్లి వెంకన్న స్వామిని దర్శించుకున్న
చిర్ల.. విప్పర్తి
కోస్తా ఎన్ కౌంటర్
ఆత్రేయపురం మండలం పరిధిలోని
వాడపల్లి గ్రామంలో వేంచేసి యున్న వేంకటేశ్వరస్వామి వారిని ఆదివారం ఉదయం ప్రభుత్వ విప్ కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డితో కలిసి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్  దర్శించుకున్నారు వీరికి ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ వర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇటీవలే   జెడ్పిచైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు
నూతనంగా ఎన్నికైన కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు బోనం సాయిబాబు, కుడుపూడి శ్రీనివాసరావు, గూడపాటి రమాదేవి ప్రవీణ్, తోరాటి సీతామహాలక్షి రాంబాబు, మండల పరిషత్ అధ్యక్షులు కుందా అన్నపూర్ణ లక్ష్మణరావు, కర్రి లక్ష్మీ వెంకట నాగదేవి వీర్రెడ్డి, మార్గాన గంగాధర్, తోరాటి లచ్చన్న. మండల పరిషత్ ఉపాధ్యక్షులు .ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ఘన సత్కారం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కార్యనిర్వహణ అధికారి, ఆలయ అర్చకులు సిబ్బంది వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comment here